పంజాబ్‌లోని పటియాలాలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో శిక్షణ పొందుతున్న ఓ మైనర్ అథ్లెట్‌పై కజకిస్తాన్‌కు చెందిన సైక్లింగ్ కోచ్ మక్సాత్ అయెజ్ బాయెవ్ అత్యాచారానికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పటియాలా పోలీసులు విదేశీ కోచ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు అతని పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతను ఎక్కడ దాక్కున్నాడనే దానిపై ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు.