కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా రూ.1500 కోట్లతో పలు అభివృద్ధి పనులను ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మంగళవారం ఉదయాన్నే పవన్ తన పర్యటనను ప్రారంభించారు. తొలుత గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని శ్రీసీతారామ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు పథకాల లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేశారు. 30 మంది మత్స్యకారులకు రక్షణ పరికరాలు అందించారు.