అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై టెలివిజన్ నెట్వర్క్ తిరుగుబాటు ప్రకటించింది. ఆయన కార్యక్రమాల కవరేజీని మీడియా సంస్థలు బహిష్కరించాయి. సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థల రిపోర్టింగ్ పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ట్రంప్ వాటిని నిషేధించారు. ఈనేపథ్యంలో ట్రంప్ తాజాగా ట్రంప్ టీవీని ప్రారంభించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ మీడియా సంస్థలు నిష్పక్షపాతంగా ఉండాలని, వారు నకిలీ వార్తలు ప్రచురిస్తే వాటిని అనుమతించకూడదని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. నిషేధాన్ని ఎత్తివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అవి న్యాయస్థానాలను ఆశ్రయించాయి.