ిజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం నిర్వహించిన ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై శాప్ డైరెక్టర్ సంతోశ్ ఫిర్యాదు చేయగా మాచవరం పోలీసులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మచిలీపట్నం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, నాగార్జున యాదవ్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై బిఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేశారు.