కుప్పం పట్టణం స్వర్ణ కుప్పంగా మారుతోందని కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్ లను నీళ్లతో నింపి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే రూ.2 కోట్లతో రైతు బజార్ నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. కుప్పం మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ. 45 కోట్లతో బీరుగానిపల్లె దగ్గర రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.