loader

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ‘ఓపెన్ ఏఐ’ ను ముగ్గురు భారతీయులు హర్ష్‌ జైశ్వాల్, మోహన్‌ పెదపాటి, రాహుల్‌ మైనీలు హ్యాక్ చేశారు. వీరిలో ఒకరిది ఏపీ కావడం విశేషం. ఆ సంస్థ నిర్వహించిన బగ్‌ బౌంటీ ప్రోగ్రామ్‌లో భాగంగా హ్యాక్ చేశారు. ఈ ముగ్గురు టెక్ పరిశోధకులు 72 గంటల పాటు కృషి చేసి, ఓపెన్‌ ఏఐ ప్రైవేట్‌ రిపాజిటరీలో బగ్‌ను గుర్తించి, యాక్సెస్‌ చేయగలిగారు. ఈ విషయాన్ని ఓపెన్‌ ఏఐకు వివరించారు. ఆ లోపాన్ని ఓపెన్‌ ఏఐ సరిచేసుకుంది. బగ్ బౌంటీ కింద వీరి 6,500 డాలర్ల అంటే సుమారు రూ.6.23 లక్షల రివార్డు అందించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON