తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతూ వాయుగుండంగా, ఆపై తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాలకు చేరుకునే క్రమంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని సమాచారం అందించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వాన తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉంది.