రాష్ట్రంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రధాని,సీఎంతో పాటు సంబంధిత శాఖల మంత్రుల ఫొటోల్ని ప్రోటోకాల్ ప్రకారం ప్రకటనలపై ముద్రించాలి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగితే ఊరుకునేది లేదంటూ మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు తేల్చిచెప్పినట్లు సమాచారం. కానీ తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం ఇచ్చిన యాడ్ లో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫొటో లేదు. దీంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. అయితే ఈసారి చంద్రబాబు ఆదేశాల్నీ పట్టించుకోరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.