దేశమంతా ఓ సిస్టమ్ చేతిలో బందీగా ఉందని, విద్యార్థులు ప్రశ్నలు అడగడం కూడా ఆ వ్యవస్థకు ఏ మాత్రం ఇష్టం లేదని మధ్యప్రదేశ్ ఇందౌర్‌లో నిర్వహించిన ఛాత్రోం కీ గూంజ్ (విద్యార్థుల గొంతుక) కార్యక్రమంలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు ప్రశ్నలు అడగడం, వ్యవస్థను ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యానికి అవసరమని, కానీ అది ఇక్కడ కుదరట్లేదని, వ్యవస్థ వారిని భయపెడుతోందని,విద్యా రంగంలో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరత వంటి అంశాలపై విద్యార్థులు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు.