2010లో ఒడిశాలో ధరణి ప్రారంభమైందని, కానీ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తానే ధరణి తెచ్చానని చెప్పుకున్నారని, ఒడిశాలో ధరణిని కాగ్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. అయినా కెసిఆర్ ధరణిని తెచ్చి పెట్టారని, ధరణితో దందాలకు తెరలేపారని మండిపడ్డారు. ధరణి చిట్టా చెప్పాలనే కెసిఆర్‌ను పదే పదే సభకు రావాలని అడిగానని, అందుకే బబుల్ షూటర్ కెసిఆర్‌ను సభకు రావొద్దని చెప్పాడని ఎద్దేవా చేశారు. అది బయటపడుతుందనే సభ నుంచి పారిపోయారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.