మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కీలక ప్రకటన చేశారు. AI అభివృద్ధిలో అలైన్‌మెంట్, నమ్మకం, జవాబ్దారీతనం అనే మూడు అంశాలు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో మెటా తీసుకుంటున్న చర్యలను ఆయన ఉదాహరణగా చూపారు. తమ అత్యాధునిక AI మోడల్ ‘Muse’ రోల్‌అవుట్‌ను మెటా ఉద్దేశపూర్వకంగానే పలు నెలల పాటు వాయిదా వేసిందని వెల్లడించారు. మోడల్‌ను మరింత సురక్షితంగా, బాధ్యతాయుతంగా తయారు చేయడం కోసం అదనపు భద్రతా పరీక్షలు, సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.