యూపీఐ పేమెంట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త MDR (Merchant Discount Rate) విధానాన్ని ప్రకటించింది. కొన్ని కీలక రంగాలకు ప్రత్యేక MDR రేటును నిర్ణయించారు. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఫ్యూయల్, వ్యవసాయ ఇన్‌పుట్స్ వంటి ఎంపిక చేసిన రంగాల్లో జరిగే UPI చెల్లింపులకు 0.4% బదులు ఒక్కో లావాదేవీకి రూ.5 ఫ్లాట్ MDR వర్తిస్తుంది. అంటే ఈ కేటగిరీల్లో పేమెంట్ మొత్తం పెరిగినా, నిర్ణయించిన నిబంధనల ప్రకారం MDR రూ.5గానే ఉంటుంది.