తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ ప్రముఖుడు విజయ్ క్రేజ్ సరిహద్దులు దాటి లండన్ వీధుల్లోనూ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయనను చూసేందుకు వేలాది మంది అభిమానులు, ఎన్ఆర్‌ఐలు లండన్‌లోని ప్రసిద్ధ ‘ది షార్డ్’ భవనం వద్దకు భారీగా తరలివచ్చారు. అయితే, ఊహించని విధంగా భారీగా జనం తరలిరావడం, అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా బ్రిటన్ పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. దీంతో గంటల తరబడి నిరీక్షించిన అభిమానులు తీవ్ర నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది.