ట్యాంక్ బండ్‌పై ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధించారు. GHMC, హైదరాబాద్ పోలీస్ శాఖ కలసి సంయుక్తంగా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాయి. అప్పర్ ట్యాంక్ బండ్ వెంబడి భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలవడంతో ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా నిర్మించిన ఘాట్లలో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. ఇక భారీ విగ్రహాల కోసం ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా సమీపంలో ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌లు, క్రేన్లను సిద్ధం చేస్తున్నారు.