సీఆర్పీఎఫ్ కోబ్రా (CoBRA) యూనిట్ ఐజీగా ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ నియమితులయ్యారు. ఈ యూనిట్ కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అస్సాం- మేఘాలయ క్యాడర్ కు చెందిన సంజుక్త.. 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. అస్సాంలోని దట్టమైన అడవుల్లో క్లిష్టమైన సవాళ్ల నడుమ అనేక కీలక ఆపరేషన్లు నిర్వహించిన ఆమెకు.. ‘ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం’గా పేరుంది.మావోయిస్టులను, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు 2008లో కోబ్రా యూనిట్ ఏర్పాటైంది.