హిందుత్వ కార్యకర్త రవీంద్ర పాల్ అలియాస్ ధారా సింగ్‌ను ముందస్తుగా రిలీజ్ చేసేందుకు ఒడిశా సర్కారు వ్యతిరేకించింది. ఆస్ట్రేలియాకు చెందిన గ్రహం స్టెయిన్స్‌తో పాటు అతని ఇద్దరు మైనరు కుమారులను హత్య చేసిన కేసులో ధారా సింగ్ జీవితకాల శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీన జరిగిన స్టేట్ సెంటెన్స్ రివ్యూ బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ దశలో ముందస్తుగా ధారాసింగ్‌ను రిలీజ్ చేయడానికి సుముఖంగా లేనట్లు బోర్డు పేర్కొన్నది.