రియల్ స్టార్ దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఆస్పత్రి బెడ్ పై సెలైన్ బాటిల్స్ తో కనిపించింది. అయితే తన హెల్డ్ కండిషన్ పై స్వయంగా డిస్కో శాంతినే అప్డేట్ ఇచ్చింది. ‘ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఇంటికి కూడా చేరుకున్నాను’ అని రాసుకొచ్చారు. అయితే ఉన్నట్లుండి ఆమె ఎందుకు ఆస్పత్రి పాలయ్యిందో మాత్రం చెప్పలేదీ సీనియర్ నటి.