విజయవాడ నగర పాలక సంస్థలో డివిజన్ల సంఖ్యను గణనీయంగా పెంచింది. ఇప్పటివరకు విజయవాడ కార్పొరేషన్‌లో 64 డివిజన్లు ఉండగా, కొత్తగా మరో 22 డివిజన్లను జోడించి మొత్తం సంఖ్యను 86కు పెంచుతూ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. మే 18 నుంచి 24 వరకు ప్రజలు మరియు వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు, సూచనలను అధికారులు స్వీకరించారు. ఈ పునర్విభజన ప్రక్రియలో అత్యధిక మార్పులు విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోనే చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు తూర్పు నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్ల సంఖ్య కాస్తా 29కి చేరింది.