సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోతుకుంటలో 40 ఎకరాల భూమి వివాదంలో ప్రభుత్వానిదేనంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఈ భూమి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందినదంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొనసాగనుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం 219 రోజుల ఆలస్యం చేసింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ దీపంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది.