బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో CBI FIR నమోదు చేసింది. అందులో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, నటులు డినో మోరియా, రియా చక్రవర్తి పేర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హత్య, సామూహిక అత్యాచారం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును బాంబే హైకోర్టు సీబీఐకి అప్పగించిన రెండు వారాల తర్వాత ఎఫ్ఎస్ఐఆర్ నమోదయ్యింది.