ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్‌ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆర్‌ఎస్‌ఐ సత్యనారాయణ తన రివాల్వర్ గన్‌తో కాల్చుకున్నాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆర్‌ఎస్‌ఐ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం విశాఖపట్నంలోని కెజిహెచ్‌లో ఆర్‌ఎస్‌ఐకి చికిత్స అందిస్తున్నారు. ఎపిఎస్‌పి ఆరో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

