నిన్న మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఊహించినట్టుగానే పాకిస్థాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్‌ను తీసుకోవడానికి టీమ్ఇండియా నిరాకరించింది. భారత్ గెలిస్తే ఏసీసీ ఛైర్మన్ నుంచి ట్రోఫీ ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోబోమని తాము ముందే చెప్పామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. ఆయనకు బదులుగా ఏసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఖలీద్ అల్ జరూనీ ట్రోఫీ ఇస్తే కచ్చితంగా తీసుకుంటామని సూచించినట్టు వెల్లడించారు.

