ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక అర్థశతకాలు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ని రూట్ అధిగమించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రూట్ ఈ ఘనత సాధించాడు. జో రూట్ – 69*, సచిన్ – 68, ఎస్ చందర్‌పాల్ – 66, అలెన్ బోర్డర్ – 63