పుతిన్ మోదీ కలిసి.. పుతిన్ ప్రత్యేక అధికారిక వాహనమైన ‘ఔరస్ సెనాట్’ ఆర్మర్డ్ లిమోజిన్‌లో ప్రయాణించారు. రష్యాకు చెందిన ‘NAMI’ సంస్థ, పోర్షే ఇంజనీరింగ్ భాగస్వామ్యంతో ‘కోర్తేజ్’ ప్రాజెక్ట్ కింద నిర్మించిన ఈ ప్రెసిడెన్షియల్ లిమోజిన్ బుల్లెట్ ప్రూఫ్, క్షిపణి, బాంబు దాడి నిరోధక సామర్థ్యం కలిగి ఉంటుంది. రసాయన దాడి జరిగినా కారు లోపల ఉన్నవారికి ఆక్సిజన్ అందించే గాలి సరఫరా వ్యవస్థ దీనికి ఉంది. పంక్చర్ అయినా లేదా పేలిపోయినా సురక్షితంగా వేగంగా ప్రయాణించే సాలిడ్ రబ్బర్/రన్-ఫ్లాట్ టైర్లను కలిగి ఉంటుంది.