ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం శుక్రవారం (సెప్టెంబర్ 11) భారత్ మండపంలో ప్రారంభమైంది. భారత్ మండపానికి చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తమిళ మహాకవి తిరువళ్లువర్ రచించిన ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని బహూకరించారు. ప్రాచీన తమిళ సాహిత్యంలోని గొప్ప గ్రంథంగా గుర్తింపు పొందిన తిరుక్కురళ్‌లో జీవితం, నైతికత, ప్రేమ, పాలన, సామాజిక విలువలకు సంబంధించిన సూత్రాలు ఉన్నాయి.