ఫైల్స్ క్లియరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఫైల్స్ క్లియరెన్స్‌కు మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్ అధిక సమయం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా ఇంప్రూవ్ కావాల్సి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని కొందరు మంత్రులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.