హైదరాబాద్‌లోని శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఎనిమీ ప్రాపర్టీస్ భూములను కొందరు అక్రమార్కులు కొద్ది రోజులుగా మెల్లిమెల్లిగా ఆక్రమించుకుంటున్నారు. ఖాళీగా ఉన్న భూములను కబ్జా చేద్దామని సుమారు నాలుగెకరాల్లో ఏకంగా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఫంక్షన్ హాళ్లు, షెడ్లు నిర్మించేందుకు వీలుగా చకచకా పిల్లర్లను వేస్తున్నారు. 1962లో భారత్‌పై చైనా దండయాత్ర, 1965-71 వరకు జరిగిన ఇండో-పాక్ యుద్ధం తర్వాత భారతీయుల్లో వందల మంది దేశాన్ని వదిలేసి వెళ్లి పాకిస్థాన్, చైనా దేశాల్లో స్థిరపడిన వారి ఆస్తులను ‘ఎనిమీ ప్రాపర్టీస్’ అంటారు.