అమెరికాలో జరిగిన భయానక 9/11 ఉగ్రదాడులకు 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బాధితులను స్మరించుకున్నారు. శుక్రవారం వారికి నివాళులర్పిస్తూ.. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని అమాయకుల ప్రాణాలను బలిగొందని మోదీ పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి భారత్ దశాబ్దాలుగా బాధిత దేశంగా ఉందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నిరంతరం పోరాడుతోందని, ఉగ్రవాద ముప్పు రూపాలు, పద్ధతులు మారుతున్నప్పటికీ.. అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలన్న భారతదేశ సంకల్పంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.