సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ క్యాలెండర్ రూపొందించాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఏయే సంక్షేమ పథకాలు.. ఏయే తేదీల్లో ఇస్తున్నామనే అంశాన్ని తేదీలతో సహా వెల్లడించాలని సూచించారు. సంక్షేమం కింద అందిస్తున్న నగదు సద్వినియోగం చేసుకునే అంశంపై.. లబ్దిదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని వారికి స్పష్టం చేశారు.