నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలాపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎస్పీ తీరుతో తాము మానసిక క్షోభకు గురవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. అకారణంగా బదిలీలు చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎస్పీ చర్యలతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, అంతేకాకుండా జిల్లా కేంద్రంలో అక్రమ దందాలు నిర్వహించే వారి దగ్గర డబ్బులు తీసుకొని ఎస్పీ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కిందిస్థాయి ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీతో పాటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాశారు.