ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని గణేష్ మండపాలకు 3 కిలోవాట్ల (kW) వరకు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 5 కిలోవాట్ల వరకు ఉచితంగా కరెంట్ సరఫరాను అందించనున్నారు. తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. మండపాల వద్ద నాణ్యమైన వైరింగ్ మాత్రమే వాడాలని, ఎలాంటి అక్రమ కనెక్షన్లు లేదా హుక్కింగ్‌లు పెట్టకూడదని విద్యుత్ శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.