సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ అత్యంత భద్రతా ఆర్మరీ చోరీ వెనుక విశ్రాంత ఆర్మీ అధికారి మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సదరు రిటైర్డ్ అధికారికి తన పూర్వ కమాండింగ్ ఆఫీసర్‌తో తీవ్ర వ్యతిరేకత, వివాదాలు ఉన్నాయని, ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేందుకే ఈ కుట్ర పన్ని ఆయుధాల దొంగతనానికి పథకం రచించినట్లు గుర్తించారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని ఒక ప్రదేశం నుంచి చోరీకి గురైన భారీ ఆయుధ నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.