ఫైళ్లు పెండింగ్లో ఉంటే అభివృద్ధి, పాలన కూడా పెండింగ్లో ఉన్నట్టేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ మద్యం విధానం అక్రమాలను కలెక్టర్ల సదస్సులో సీఎం లేవనెత్తారు. ఇగోలు పక్కనపెట్టి ప్రజా సేవకులుగా పని చేద్దామంటూ అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 27 నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, సంక్షేమానికి రూ.1.40 లక్షల కోట్లు, అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.ఫేక్ ప్రచారాల రాజకీయ కుట్రలకు అధికారులు వేగంగా కౌంటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.