తిరుమల శ్రీవారి దర్శనం కోసం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తులకు వన్యమృగాల భయం మరోమారు పట్టుకుంది. నడక మార్గంలోని 7వ మైలు సమీపంలో ఉన్న మండపం వద్ద చిరుత పులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. అకస్మాత్తుగా చిరుత ప్రత్యక్షం కావడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురై, కేకలు వేస్తూ భయంతో వెనక్కి పరుగులు తీశారు.
నడక మార్గంలో తక్షణ భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులను ఎవరినీ ఒంటరిగా అనుమతించకుండా, కేవలం గుంపులుగా మాత్రమే ముందుకు పంపిస్తున్నారు.