ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని 7 రైల్వే ప్రాజెక్టులను ఫోర్-లేన్ చేసేందుకు ఆమోదం తెలిపినట్లు, అరక్కోణం నుంచి రేణిగుంట వరకు 3వ, 4వ లైన్‌లతో పాటు ఘట్‌కేసర్- కాజీపేట మధ్య నాలుగో లేన్ నిర్మాణానికి మోదీ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి తెలిపారు 5 రాష్ట్రాలు, 14 జిల్లాలు కవర్ చేసేలా రూ.10,783 కోట్లతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.