గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి సెంట్రల్ ఏసీపీ దామోదర్‌పై ఫిర్యాదు చేశారు. తన తరఫున కేసులను వాదిస్తున్న అడ్వకేట్ సత్యశ్రీని ఏసీపీ దామోదర్ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వల్లభనేని వంశీ ఆరోపించారు. 2021లో విజయవాడలో సత్యశ్రీ కుటుంబం ఒక ఫ్లాట్ కొనుగోలు చేయగా, ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన ఆ స్థల వివాదంలో ఏసీపీ జోక్యం చేసుకుని వేధిస్తున్నారని పేర్కొన్నారు. పక్కింటి వారు ఆక్రమణలకు పాల్పడుతుంటే అడ్డుకున్నందుకు సత్యశ్రీపై 2 తప్పుడు కేసులు నమోదు చేశారని వివరించారు.