యూట్యూబర్ ఫేమ్ నందన బిగ్ బాస్ హౌస్ 10 లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తుందన్న వార్తలపై కాంగ్రెస్ నాయకురాలు సంధ్యారెడ్డి బిగ్ బాస్ టీమ్, హోస్ట్ నాగార్జునకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఇలాంటి క్రిమినల్స్ సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తారు. ఇలా మోసాలకు పాల్పడే వారిని బిగ్ బాస్ లోకి పంపిస్తే నాగార్జున గారిని కూడా ప్రశ్నిస్తాం. ఈ విషయంలో కచ్చితంగా రచ్చ చేస్తాం’ అని సంధ్యా రెడ్డి మండిపడ్డారు.