వచ్చే మార్చి నాటికి భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కోనసీమ జిల్లా మాచవరంలో జరిగిన మీ భూమి- మీహక్కు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకే సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. గతంలో రెవెన్యూశాఖలో డబ్బు ఇస్తేనే గాని పని జరిగేదన్న అపవాదు ఉండేది. దాన్ని మార్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామన్నారు.