బుధవారం శాసనసభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎస్సిలపై బిఆర్ఎస్ విపక్ష చూపుతోందని తీవ్రంగా మండిపడ్డారు. దళిత సమాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎస్సిలు నిరసన కార్యక్రమం చేపట్టారని.. ఎస్సీలు నిరసన తెలిపిన ప్రాంతంలో పసుపు నీళ్లతో బిఆర్ఎస్ నాయకులు శుద్ధి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుద్ధీకరణ పేరుతో బిఆర్ఎస్ చిల్లర రాజకీయం చేసిందని… ఎస్సిలకు బిఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి ధ్వజమెత్తారు.