తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సెషన్ ముగిసే వరకు బీఆర్ఎస్కు చెందిన సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మూడో రోజున బీఆర్ఎస్ సభ్యులు వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను పదే పదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెనక్కి తగ్గాలని, ఇది దొరల పాలన కాదని కేటీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ ఘాటుగా హెచ్చరించారు