రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమితులైన నేరేళ్ళ శారద ఆ పదవిని తిరస్కరించినట్లు తెలిసింది. గతంలో తనను కాదని గద్వాల విజయలక్ష్మికి చైర్ పర్సన్ పదవినిచ్చి, తాజాగా గద్వాలకు మరో పదవి అప్పగించి, ఆమె వదిలేసిన చైర్ పర్సన్ పదవిని తనకు అప్పగిస్తారా? అంటూ ఆమె అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అందుకే ఆమె చైర్ పర్సన్ పదవీ బాధ్యతలు స్వీకరించలేదని తెలుస్తోంది.