ఇండోనేషియా లోని సుప్రసిద్ధ అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది. సుమారు 25 గంటలపాటు నిరంతరాయంగా లావా, బూడిద వెదజల్లడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మొత్తం 8 ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. ఈ నిర్ణయంతో సుమారు 2,300 విమాన సర్వీసులు రద్దు లేదా దారి మళ్లించారు. దీనివల్ల దాదాపు 2.70 లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ లెవెల్-3 (హై అలర్ట్) హెచ్చరికను జారీచేసింది. స్థానికంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.