పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఒకప్పటి క్రికెటర్ల మద్దుతు పెరుగుతోంది. ఆ దేశానికే చెందిన వెటరన్ వసీం అక్రమ్ కూడా ఇమ్రాన్ ఆరోగ్యంపై తాము రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. తమతో ఒకప్పుడు ఆడిన దిగ్గజ ఆటగాడి కోసం క్రికెట్ లోకం కదులుతోంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆ దేశ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. పాక్ లెజెండ్ వసీం అక్రమ్ కూడా ఇమ్రాన్‌కు బాసటగా నిలిచాడు.