ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఇవాళ వడోదరలో రూ. 35,000 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి దేశానికి అంకితం చేశారు. అనంతరం నవసారిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, అధికారం, వ్యవస్థలు, హోదాలు కేవలం ప్రజాసేవ కోసమేనని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామనే అహంకారం కాకుండా నిరంతరం ప్రజలకు సేవ చేయడమే బీజేపీ శ్రేణుల ప్రధాన సూత్రమని ప్రధాని ప్రశంసించారు.