శాసనసభ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై మండలి ఛైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఇద్దరినీ సస్పెండ్ చేయాలని శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించిన ఛైర్మన్.. సెషన్ మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. అనంతరం మండలి వాయిదా పడింది.