శంషాబాద్ ఎయిర్పోర్ ట్లో అరెస్టయిన యూట్యూబర్ నందన ను పోలీసులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్ కు తీసుకొచ్చారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డారంటూ నందన, ఆమె భర్తపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం పీఎస్ లో గతంలో కేసు నమోదైంది.బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానంలో శంషాబాద్ లో దిగారు. ఆమె పాస్ పోర్ట్, వీసా పత్రాలు తనిఖీ చేసిన ఇమిగ్రేషన్ అధికారులు ఎల్వోసీ ఆధారంగా అదుపులోకి తీసుకొని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు