సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల శ్రేణులు పోటాపోటీగా ఆందోళన బాట పట్టడంతో పటాన్‌చెరు జాతీయ రహదారి (NH 65) పరిసరాలు రణరంగంగా మారాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో నినాదాలు చేయగా.. మరోవైపు గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలోని అవినీతి, ప్రజా వంచనను ఎండగడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు.