ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సోమవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం.. ఫొటోతో కూడిన పూర్తి స్థాయి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం సెప్టెంబర్ 23, 24వ తేదీలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పాలనాపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, సకాలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.