“సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి పోలీసులపై దాడి చేశారు. ఓ శాసనసభ్యుడు యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి కాలర్ పట్టుకున్నారు. పోలీసులపై దాడి చేయడం మీడియా ఛానళ్లలో స్పష్టంగా కనిపించింది. పోలీసులపై కేటీఆర్ చేయిచేసుకున్నట్లు కనబడుతోంది. పోలీసు సిబ్బంది గొంతు నొక్కుతున్నట్లు కనిపించింది. ప్రజాప్రతినిధులు హుందాగా ప్రవర్తించాలి. బీఆర్ఎస్ సభ్యుల తీరు చాలా దారుణంగా ఉంది. స్పీకర్ పై ఘోరమైన భాష ఘటనపై స్పందించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ అధినేత KCRకు ఉందన్నారు. కేసీఆర్ స్పందించకుంటే ఆయనే ప్రేరేపించారన్న అనుమానాలు వస్తాయన్నారు శ్రీధర్ బాబు