తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఆందోళన బాట పట్టాయి. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపు, సెప్టెంబర్ 8న రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల Colleges Bandhబంద్కు పిలుపునిచ్చాయి. తెలంగాణ ప్రైవేట్ పీజీ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ (TPDMA) ఈ నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీల నిర్వహణ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని యాజమాన్యాలు చెబుతున్నాయి.